Breaking News

పెన్షన్‌ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

Published on Sat, 09/20/2025 - 06:01

  పరిగి: పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకున్న కొడుకు పెన్షన్‌ డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూర్‌ మల్లమ్మ (57)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు కాగా, పెద్ద కుమారుడు ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇతని మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య విడాకులు తీసుకుంది.

ఎలాంటి సంపాదన లేకపోవడంతో తల్లికి వచ్చే ఆసరా పెన్షన్‌ డబ్బులు లాక్కుని నిత్యం మద్యం తాగేవాడు. ఇటీవల పెన్షన్‌ రావడంతో గత బుధవారం సాయంత్రం డబ్బులు ఇవ్వమని అడగ్గా.. ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై మరుసటి రోజు శుక్రవారం ఇంట్లోనే చనిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. చిన్న కుమారుడు మహిపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.   

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)