Breaking News

మలేషియా వదిలి వెళ్లండి..

Published on Wed, 03/11/2026 - 12:30

నిర్మల్‌ఖిల్లా: మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీచేసింది. సరైన వీసా పత్రాలు లేకుండా లేదా వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్నవారు ఏప్రిల్‌ 30లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. గడువు తర్వాత కూడా కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలేషియాలోని ఎన్నారై సంఘాలు భారతీయులను అప్రమత్తం చేస్తున్నాయి.

స్పెషల్‌ డ్రైవ్‌ అమలు
అక్రమ వలసదారులు ఎటువంటి చట్టపరమైన ఇ బ్బందులు ఎదుర్కోకుండా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేలా మలేషియా ప్రభుత్వం ‘మైగ్రెంట్‌ రిపాట్రియేషన్‌ ప్రోగ్రామ్‌ 2.0 అమలు చేస్తోంది. ఈ పథ కం ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకున్నవారు కేవలం నామమాత్రపు జరిమానా చెల్లించి చట బద్ధంగా తమ దేశాలకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ పథకం గడువు ఏప్రిల్‌ 30తో ముగియనుంది.

గడువు తర్వాత చర్యలు 
గడువు తర్వాత దేశంలో అక్రమంగా ఉంటున్నవారిపై మలేషియా అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి పత్రాలు లేని వారిని గుర్తించి అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ఒకసారి అరెస్టు అయితే భారీ జరిమానాలు, జైలుశిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని ఎన్‌ఆర్‌ఐ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

పాస్‌పోర్ట్‌ లేనివారికి ప్రత్యేక సదుపాయం
కొంతమంది భారతీయుల వద్ద పాస్‌పోర్టులు పోవడం లేదా చెల్లుబాటు కాలేకపోవడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్‌ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా పాస్‌పోర్ట్‌ లేకపోయినా భారత్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది.

అప్రమత్తంగా ఉండాలి
మలేషియాలో ఉన్న తమ బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేసి, గడువులోపు స్వదేశానికి తిరిగివచ్చేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఎన్నారై సలహాకమిటీ వైస్‌ చైర్మన్‌ మందా భీమ్‌రెడ్డి, సభ్యులు స్వదేశ్, ఎన్‌ఆర్‌ఐ సంఘాలు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా స్వదేశానికి చేరుకునేందుకు ఇదే చివరి అవకాశం కావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)