డిపోల్లో ఎలక్ట్రిక్‌తో పాటు ఇతర బస్సుల నిర్వహణ

Published on Wed, 01/22/2025 - 06:11

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్‌ బస్సులతో పాటు కొన్ని ఆర్టీసీ సొంత బస్సులు, ఇప్పటికే తిప్పుతున్న అద్దె బస్సుల నిర్వహణ కూడా కొనసాగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంటే హైబ్రిడ్‌ పద్ధతిలో డిపోలను వాడనుంది. ఎలక్ట్రిక్‌ బస్సులను భారీ సంఖ్యలో సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, వాటి సరఫరా సంస్థకు డిపోలను కేటాయించనున్న తీరును వివరిస్తూ ‘ప్రైవేటు చేతికి ఆర్టీసీ డిపోలు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సంస్థ వైఖరిపై ఉద్యోగులతో పాటు, ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్టీసీ స్పందించింది. 

డిపోలను కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులకే పరిమితం చేయకుండా, ఇతర బస్సులకు కూడా ఉపయోగిస్తామని ప్రకటించింది. ‘డిపోల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ అ«దీనంలోనే ఉంటుంది. కార్యకలాపాలన్నీ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేసే సంస్థ డిపో స్థలాన్ని చార్జింగ్, పార్కింగ్‌ కోసం మాత్రమే వినియోగించుకుంటుంది..’అని స్పష్టం చేసింది. ‘గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో నడిచే ఎలక్ట్రిక్‌ బస్సుల విషయంలో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సంస్థలో డ్రైవర్లకు కొరత ఉంది. వివిధ కేటగిరీలకు సంబంధించి 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ నియామక ప్రక్రియ వివిధ నియామక సంస్థల పరిశీలనలో ఉంది..’అని పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)