Breaking News

పొయ్యిల కట్టెల కష్టాలు !

Published on Sat, 02/15/2025 - 12:13

సిరిసిల్ల: ఎలక్ట్రిక్‌ కుక్కర్‌, గ్యాస్‌ సిలిండర్‌పై వంట లు చేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు వంటకు కట్టెలనే వినియోగిస్తున్నారు. సగటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగైందని నివేదికలు వస్తున్నా ఆకలిమంటను తీర్చుకునేందుకు వంట చేయాలంటే కట్టెల పొయ్యిని వెలిగించాల్సిందే. 

ఇంటింటికీ దీపం పథకంలో ఉచితంగా సిలిండర్లు ఇచ్చామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటించిన సిరిసిల్ల కార్మికక్షేత్రంలో ఇంకా కొందరు పేదలు వంట కోసం కట్టెల వేటలో కష్టాలు అనుభవిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని పేద కుటుంబాలు వారంలో ఒక్క రోజు ఇలా ఎండిన కట్టెల కోసం సిరిసిల్ల శివారులో అన్వేషిస్తున్నారు. దొరికిన కట్టెలను మోపులుగా కట్టుకుని నెత్తిన మోస్తూ ఇంటికి చేరుతున్నారు. సిలిండర్‌ కూడా కొనలేని స్థితిలో కట్టెలను నమ్ముకుని ఇలా కష్టాలను అనుభవిస్తున్నారు. వంట బాధ్యత మహిళలదే కావడంతో కట్టెలను సమకూర్చుకునే అదనపు బాధ్యతలు తీసుకుంది.

 సిరిసిల్లలో నిత్యం కట్టెల వేటలో మహిళలు సర్కారుతుమ్మ, తుంపల్లో తిరుగుతూ కట్టెలు, కాగితం అట్టపెట్టెలను ఏరుతూ కనిపిస్తున్నారు. ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి. కానీ గిన్నెలపై మా నాన్న పేర్లు’ ఉన్నాయని ఓ మహిళా రచయిత్రి పురుషాధిక్య సమాజాన్ని రెండు దశాబ్దాల కిందటే ప్రశ్నించారు. కట్టెల కష్టాలకు ఎదురీదుతూ వండివారుస్తున్న ‘ఆమె’కు వందనం. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో ఇంకా సిలిండర్‌ లేని కుటుంబాలను గుర్తించి వారికి ఉచితంగా ‘దీపం’ పథకంలో సిలిండర్లు అందిస్తే ఇలాంటి కట్టెల కష్టాలు తీరుతాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)