Breaking News

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో నరమేధం

Published on Mon, 06/02/2025 - 06:05

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో ప్రజాస్వా మ్యాన్ని కాపాడుకొ నేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఫాసిస్టు పాలన సాగు తోందని విమర్శించారు. మావో యిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఛత్తీస్‌గ ఢ్‌లో నరమేధం కొనసాగిస్తున్నా రని ఆరోపించారు.

మావోయిస్టు లు చర్చలకు సిద్ధమని ప్రకటించినా చలించని ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొట్టి కాయలు వేయగానే పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో చర్చ లకు సిద్ధమయ్యారని విమర్శించారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన మోదీ ప్రభు త్వం.. సొంత దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు సృష్టిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీలపై యుద్ధం ఆపాలి: కోదండరామ్‌
ఎన్‌కౌంటర్ల పేరుతో నక్సలైట్లను చంపటం సరికా దని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివాసీలపై యుద్ధం ఆపాలని కోరారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిని కోరుకోవడం సరైనమార్గమని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో భాగంగానే మావోయిస్టుల అణిచివేతకు దిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. శాంతి చర్చల కమిటీ ప్రతినిధి ప్రొ ఫెసర్‌ అన్వర్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రకుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ నేతలు పద్మ, వేములపల్లి వెంకట రామయ్య, జీవన్‌కుమార్, అన్వేష్, కందిమల్ల ప్రతా ప్‌రెడ్డి, గాదగోని రవి తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)