Breaking News

తెలంగాణ‌ ఆర్టీసీకి మహాలక్ష్మి షాక్‌

Published on Sun, 03/30/2025 - 15:58

సాక్షి, హైదరాబాద్‌: మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ.650 కోట్లను తెలంగాణ‌ ప్రభుత్వం బకాయిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆది, సోమ, మంగళవారాలు వరుస సెలవులు. శనివారం పనివేళలు ముగిసే సమయానికి ఆ మొత్తం విడుదల కాలేదని తెలిసింది. దీంతో ఇక అవి మురిగిపోతాయన్న ఆందోళన ఆర్టీసీలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీకి గతేడాది బడ్జెట్‌లో రూ.4,084 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో దాదాపు రూ.800 కోట్లు బకాయి ఉండగా, వారం క్రితం రూ.156 కోట్లు విడుదలయ్యాయి. మిగతావి అలాగే పేరుకుపోయి ఉన్నాయి.

గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వరకు మాత్రమే సరిపోతాయి. ఇతరత్రా అభివృద్ధి పనులకు, రాయితీ బస్‌పాసుల సర్దుబాటుకు సరిపోవు. ఇప్పుడు బడ్జెట్‌ నిధులు కూడా పూర్తిగా విడుదల కాని పక్షంలో, మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ (TGSRTC) మోయాల్సి వస్తుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగినందున.. మహాలక్ష్మి కేటాయింపులను రూ.5,500 కోట్లకు పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఆర్టీసీ కోరింది. కానీ, సర్కారు రూ.4,400 కోట్లే కేటాయించింది.  

గతంలోనూ అంతే.. 
2023 బడ్జెట్‌కు సంబంధించి కూడా గతేడాది చివరలో కొన్ని నిధులు విడుదల కాలేదు. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో చూపగా, చివరికి రూ.500 కోట్ల వరకు చేతికి అందకుండా పోయాయి. మరోసారి అదే దుస్థితి ఎదురుకావటం ఆర్టీసీకి ఇబ్బందిగా మారబోతోంది. శనివారం ఆలస్యంగానైనా నిధులు విడుదలై, తదుపరి పనిదినం రోజు ఖాతాలోకి చేరే అవకాశం కూడా ఉందన్న ఆశతో ఆర్టీసీ ఉంది.

చ‌ద‌వండి: టెన్త్‌.. జ‌వాబు ప‌త్రాలు చింద‌ర‌ వంద‌ర‌    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)