Breaking News

స‌మాజ్‌వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సింగ్ రావు

Published on Tue, 01/07/2025 - 08:38

హైదరాబాద్‌:  సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు. 

ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్‌తో  కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. 

కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)