Breaking News

అమ్మాయే పుట్టాలని కోరుకుంటా

Published on Thu, 03/27/2025 - 07:29

 ఖమ్మం: భగవంతుడు అవకాశం ఇస్తే తమకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానని ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పేర్కొన్నారు. పాలనలో వినూత్న విధానాలతో తనదైన శైలి కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల భారమని భావించకుండా వరంలా పరిగణించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘మా పాప – మా ఇంటి మణిదీపం’కార్యక్రమాన్ని రూపొందించారు. 

ఇందులో భాగంగా జిల్లాలో ఆడపిల్లకు జన్మనిచ్చిన దంపతులను జిల్లా యంత్రాంగం తరపున సన్మానించి.. స్వీట్‌ బాక్స్, ప్రశంసాపత్రం ఇచ్చేలా ఆడపిల్ల జన్మోత్సవాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తల్లాడ మండలం రామచంద్రాపురంలో 26 రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచి్చన బానోత్‌ కృష్ణవేణిని ఆమె తల్లి, అత్తయ్యతో కలిపి సత్కరించారు. వారికి స్వీట్‌ బాక్స్, పండ్లతో పాటు.. ‘అభినందనలు.. మీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది’అంటూ ముద్రించిన సరి్టఫికెట్‌ అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడపిల్లలు చూపించే ప్రేమ మగపిల్లలు చూపించరని స్పష్టం చేశారు. చదువులోనూ అమ్మాయిలే రాణిస్తున్నారని ప్రశంసించారు. 

తల్లిదండ్రులు ఆడపిల్లను అదృష్టంగా భావిస్తూ, సమానంగా చూస్తూ చదివించాలని కోరారు. సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి అభినందిస్తారని తెలిపారు. కాగా, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, జెడ్పీ సీఈవో దీక్షారైనాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)