Breaking News

మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు

Published on Thu, 10/30/2025 - 07:52

రంగారెడ్డి జిల్లా: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె లేని జీవితం వ్యర్థమని భావించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

పెళ్లికి ఒత్తిడి తేవడంతో.. 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని(21), అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఇదే విషయమై ఆమె అతడిపై ఒత్తిడి తేగా.. అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఇద్దరు ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నందిని మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ కూతురు మృతికి నాగరాజే కారణమని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. 

ఆందోళన చెంది.. 
నందిని చనిపోవడం, ఠాణాలో కేసు నమోదు కావడంతో ఆందోళన చెందిన మహేశ్‌(26).. అదే రోజు సాయంత్రం ఆగాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడే తల దాచుకున్నాడు. మానసికంగా కృంగిపోయి, భయాందోళనకు గురైన అతను.. బుధవారం ఆ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మృతితో మానసిక వేధనకు గురై మహేశ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)