Breaking News

అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!

Published on Tue, 06/09/2026 - 07:32

ములుగు జిల్లా : చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. 

స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు.

 కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచి్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)