Breaking News

ప్రేమ వ్యవహారం మలుపు.. నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితి

Published on Thu, 12/25/2025 - 10:05

నల్లగొండ జిల్లా: నేరడుగొమ్ము మండలంలో ప్రేమికుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులికంటి శ్రీను అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు మంజుల ఆరోపిస్తోంది. 

ఈ క్రమంలో గురువారం శ్రీను ఇంటి ఎదుటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన మంజుల, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంజుల కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా, తోపులాట కూడా జరిగింది. తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ మంజుల ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఘటన అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని మంజుల‌ను శాంతింపజేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు పులికంటి శ్రీను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)