Breaking News

అమ్మాయి సాఫ్ట్‌వేర్‌.. అబ్బాయి ప్రైవేట్‌ ఉద్యోగి

Published on Tue, 06/17/2025 - 07:06

స్టేషన్‌ఘన్‌పూర్‌: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్‌ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్‌ స్కూల్‌లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్‌కుమార్‌(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్‌కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

అమ్మాయి సాఫ్ట్‌వేర్‌.. అబ్బాయి ప్రైవేట్‌ ఉద్యోగి
నమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్‌కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. వినయ్‌కుమార్‌ జనగామ పిన్‌కేర్‌ బ్యాంకులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్‌కుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

గ్రామంలో విషాదఛాయలు 
భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్‌లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్‌కుమార్‌ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు 
చేపట్టారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)