కొన్నది రూ.2,400.. అమ్మింది రూ.2,200కు

Published on Wed, 07/22/2026 - 03:45

ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను టెండర్ల ద్వారా ప్రైవేట్‌ ఏజెన్సీలకు విక్రయించింది. క్వింటాకు రూ.2,200 చొప్పున టెండర్లు వేసిన వారు మక్కలను కొనుగోలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా గడిచిన యాసంగి సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.17 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు ఏకంగా 45 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా ప్రైవేట్‌ మార్కెట్‌లో మద్దతు ధర లేనందునప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా రూ.2,400తో కొనుగోలు చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,258 మంది రైతుల నుంచి రూ.796 కోట్ల విలువైన 3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఈక్రమంలో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే క్వింటాకు రూ.2,200 చొప్పున ఏజెన్సీలు దక్కించుకున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 కాగా, రవాణా, నిల్వ తదితర చార్జీలు మరో రూ.100 వరకు ఉంటాయి. అంటే క్వింటాకు రూ.2,500 కాగా, రూ.2,200కు అమ్మడంతో క్వింటాకు రూ.300 మేర నష్టం ఎదురవుతోంది. 

కాగా, మార్కెట్‌లో అయితే మక్కలకు డిమాండ్‌ ఉన్నా ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు సిండికేట్‌ కావడంతోనే తక్కువ ధర కోట్‌ చేశారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌లోని ఓపెన్‌ షెడ్లలో నిల్వ ఉన్న మక్కలను కాంట్రాక్టర్లు తీసుకెళ్లే వరకు క్రిమికీటకాలు ఆశించకుండా ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా క్రిమిసంహారక మందు పిచికారీ చేయిస్తున్నారు. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)