Breaking News

కాలేయంపై ’పని’భారం

Published on Wed, 02/26/2025 - 04:17

మానవ శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం.. పని భారంతో తల్లడిల్లుతోంది. క్రమం తప్పిన జీవన విధానాన్ని సమన్వయం చేయలేక సతమతం అవుతోంది. అవసరానికి మించిన తిండి.. అవసరమైన శ్రమ ఏమాత్రం చేయని దినచర్య కాలేయంపై పెను భారం మోపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీవన విధానంలోని మార్పులు కాలే యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరా బాద్‌ శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. 

ఈ పరిశోధనలో ఏఐజీ సీనియర్‌ హెపటాలజిస్ట్‌ పీఎన్‌ రావు, యూఓహెచ్‌ప్రొఫెసర్లు కల్యాణ్‌కర్‌ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్‌ స్కాలర్లు భార్గవ, నందిత ప్రమోద్‌ పాల్గొన్నారు. వీరి పరిశోధనలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారి ఆరోగ్యాలను పరిశీలించారు.  – సాక్షి, హైదరాబాద్‌ 

71% మంది
» అధిక బరువు (ఊబకాయం)తో  71 శాతం మంది బాధపడుతున్నారు. 34 శాతం మందిలో జీవక్రియల సమస్యలు ఉన్నాయి.

»ఎక్కువ పని గంటలు, తీవ్ర పని ఒత్తిడి, వేళాపాళా లేని  తిండి, నిద్రలేమితో కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు.

» ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం, ఎక్కువ గంటల పని, ఒత్తిడి వల్ల జీవక్రియలో ఇబ్బందులు తలెత్తి, ఫ్యాటీలివర్‌ సమస్య (ఎంఏఎఫ్‌ఎల్డీ) వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

84% మంది
» ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం దాదాపు84 శాతం మంది ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.

పరిశోధనలో తేలిన అంశాలు
జీవ క్రియల్లో సమస్యలు ఉన్న వారిలో ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.కాలేయంలో 5 శాతం కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్‌ అంటారని డాక్టర్‌ పీఎన్‌ రావు తెలిపారు. 

సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం వాపు, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే ఐటీ ఉద్యోగులు జీవన శైలిని మార్చుకోవాల్సిన తక్షణ అసవరం ఉందని సూచించారు. వ్యాయామంతోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)