Breaking News

ఒంటరిగా బతకలేక.. రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి బలవన్మరణం

Published on Mon, 01/05/2026 - 11:06

ఆదిలాబాద్‌: అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. 

ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్‌(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. 

2007లో గోల్డెన్‌షేక్‌ హ్యాండ్‌ ద్వారా రిటైర్‌ అయ్యాడు.  వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్‌లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్‌ చేశాడు. హైదరాబాద్‌కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)