Breaking News

తుది దశ ప్రచారం సమాప్తం

Published on Tue, 12/16/2025 - 06:26

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం అయింది. మూడో విడతలో భాగంగా బుధవారం (17న) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ పూర్తయ్యాక ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటించనున్నారు. ఇది పూర్తికాగానే ఉపసర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది.

ఈ విడతకు సంబంధించి ఎన్నికల అధికారులు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రీపోల్‌ అరేంజ్‌మెంట్‌లలో భాగంగా... సోమవారం ఉదయం డి్రస్టిబ్యూషన్‌ సెంటర్ల నుంచి బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, తాగునీటి వసతి కల్పించనున్నారు.

మంగళవారం సాయంత్రంకల్లా అన్ని పోలింగ్‌ బూత్‌లకు ఎన్నికల విధుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేరుకుంటారు.  మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4,157 పంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 11 చోట్ల, 36,434 వార్డుల్లో 112 చోట్ల ఒక్క నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్‌ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక మిగిలిన 3,752 సర్పంచ్‌ పదవులకు 13,128 మంది, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)