Breaking News

పెరిగిన రుణ పరపతి

Published on Mon, 05/26/2025 - 00:20

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చే రుణాలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల రుణాలు కలిపి రూ.10 లక్షల కోట్లకు పైగా బ్యాంకులు విడుదల చేశాయి. 

ఇందులో రూ.1.5 లక్షల కోట్లు వ్యవసాయ సంబంధిత రుణాలు కాగా, రూ.1.37 లక్షల కోట్ల వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలున్నాయి. అన్ని రకాల రుణాలు కలిపి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.79 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, అంతకంటే రూ.58 వేల కోట్లు ఎక్కువగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాలు విడుదల కావడం గమనార్హం.  

ఆ రెండు రంగాల్లోనే వృద్ధి 
బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాల విషయంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది. 
» 2023–24లో వ్యవసాయానికి రూ.1.39 లక్షల కోట్లకు పైగా రుణాలివ్వగా, 2024–25లో రూ.1.59 లక్షల కోట్ల వరకు అప్పులు మంజూరయ్యాయి. అంటే గత ఏడాది కంటే రూ.20 వేల కోట్ల మేర ఈసారి వ్యవసాయ రుణాలు పెరిగాయన్నమాట.  
»  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా రుణ పరపతి పెరిగింది. 2023–24లో రూ.1.19 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక రుణాలను బ్యాంకులివ్వగా, 2024–25లో రూ.1.37లక్షల కోట్లకు పెరిగింది. అంటే గతం కంటే రూ.18 వేల కోట్ల పారిశ్రామిక రుణాలు పెరిగాయి.  
» విద్య, గృహ నిర్మాణం కోసం తీసుకునే రుణా­ల్లో తగ్గుదల కనిపించింది. విద్య కోసం 2023–24లో తీసుకున్న దాని కంటే రూ. 300 కోట్లకు పైగా తక్కువగా 2024– 25లో తీసుకున్నారని ఎస్‌ఎల్‌బీసీ గణాంకాలు చెబుతున్నాయి. గృహ రుణాల విషయంలోనూ ఇదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. హౌస్‌ లోన్ల కింద 2023–24లో తీసుకున్న రుణాల కంటే 2024–25లో రూ.1500 కోట్ల వరకు తగ్గాయి.  

వ్యక్తిగత రుణాలు ఎక్కువే 
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకా­రం మహిళలకు వ్యక్తిగత రుణాలు ఈసారి భారీగానే పెరిగాయి. మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలు, మైనార్టీలు.. ఇలా సామాజికవర్గా­ల వారీగా ఇచి్చన వ్యక్తిగత రుణాలన్నింటిలో పెరుగుదల కనిపించింది. ఇక, స్వయం సహాయక సంఘాలకు రుణాలు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  
» 2023–24లో దాదాపు రూ.35వేల కోట్లు రాష్ట్రంలో­ని స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వ­గా, 2024–25లో అది రూ. 39,072 కోట్లకు చేరింది. అప్పుల లెక్క అలా ఉంటే... రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.8.40 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ లెక్కన డిపాజిట్లతో పోలిస్తే 128 శాతం అప్పులు ఉండడం గమనార్హం. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)