మద్యం బాటిల్‌లో బల్లి తోక..

Published on Thu, 12/25/2025 - 09:46

మహబూబాబాద్ జిల్లా: మందుబాబులు తాగుతున్న మద్యం బాటిల్‌లో బల్లితోక కనిపించడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ బెల్ట్‌ షాపులో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మందుబాబుల కథనం ప్రకారం.. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన కొందరు మండల కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా సమీపంలోని ఓ బెల్ట్‌ షాపులో బ్లెండర్‌ స్పైడ్‌ ఫుల్‌ బాటిల్‌ కొనుగోలు చేసి సేవిస్తున్నారు. 

ఈ క్రమంలో సగానికిపైగా అయిపోయిన మద్యం బాటిల్‌లో ఓ వింత ఆకారం కనిపించగా బయటికి తీశారు. అది తోకగా గుర్తించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మందుబాబులు వాంతులు చేసుకున్నారు. గొంతులో మంటగా ఉందని కేకలు పెట్టారు. అక్కడున్న కొందరు సదరు బెల్ట్‌ షాపు నిర్వాహకుడిని నిలదీయగా సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకున్నాడు. ఇది కల్తీ మద్యంగా భావించిన బాధితులు సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)