సమృద్ధిగా పశు సంపద

Published on Sun, 03/23/2025 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పశు సంపద సమృద్ధిగా ఉందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం వెల్లడించింది. 2012 నుంచి రాష్ట్రంలో పశు సంపద 22 శాతం పెరిగిందని తెలిపింది. సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని మొత్తం గొర్రెల్లో 25 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండడానికి వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తి, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం వల్ల వస్తున్న ఆదాయమే కారణమని సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై సర్వేలోని కీలక విషయాలు

» రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 62 శాతం వ్యవసాయ భూమి లేని రైతుల నుంచే వస్తున్నాయి.  
»   70 శాతం రైతులు పశు సంపదను కలిగి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల పశువులు ఉన్నాయి.  
»   2012 నుంచి పశు సంపద 22 శాతం పెరిగింది.  
» ఈ రంగంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తుది సవరించిన అంచనాల ప్రకారం ‘జోడించిన రాష్ట్ర స్థూల విలువ’(జీఎస్‌వీఏ) రూ.96,908 కోట్లు ఉంటే.. 2024–25 ముందస్తు అంచనాల ప్రకారం రూ.1,02,835 కోట్లకు పెరిగింది.  
»  2024–25లో చేపల ఉత్పత్తి లక్ష్యం 4,81,421 టన్నులు కాగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3,69,489 టన్నులు ఉత్పత్తి అయ్యింది. మంచినీటి రోయ్యల ఉత్పత్తి లక్ష్యం 18,366 టన్నులు కాగా.. జనవరి నాటికి 11,845 టన్నులు వచ్చింది. – చేపల పెంపకంలో కృషికిగాను రాష్ట్రానికి కేంద్రం ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఇన్‌ల్యాండ్‌ స్టేట్‌ ఇన్‌ ఫిషరీస్‌ సెక్టార్‌’అవార్డు ప్రకటించింది.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)