Breaking News

మద్యం అమ్మకాలు పెరుగుతూ.. తగ్గుతూ

Published on Tue, 02/11/2025 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలల వారీగా చూస్తే పెరుగుతూ.. తగ్గుతూ ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ప్రతి నెలా 10 శాతం మేరకు పడుతూ..లేస్తూ అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత 10 నెలల కాలంలో రూ.29,648 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల కాలంలో అమ్ముడైన మద్యం విలువ రూ. 30,696 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.1000 కోట్ల మేర మద్యం అమ్మకాలు తగ్గాయని అర్థమవుతోంది.

కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో కొత్త మద్యం షాపులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ దరఖాస్తుల కింద రూ.2,400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని మినహాయిస్తే 10 నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు రూ.1400 కోట్ల మేర పెరిగాయని తెలుస్తోంది. ఇక, నెలల వారీగా చూస్తే రూ. 2700 కోట్ల నుంచి రూ.3300 కోట్ల మేరకు అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. కాగా గత ఏడాదిలో మొత్తం 12 నెలలకు రూ. 35,586 కోట్ల మేర మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరిగాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలుంటాయని, వాటి విలువ రూ.36 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.

(నోట్‌: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల అమ్మకాల విలువను ఈ పట్టికలో లెక్కించలేదు. ఈ రెండు నెలలు కలిపి మొత్తం అమ్మకాల విలువ రూ.36వేల కోట్లకు పెరుగుతుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)