Breaking News

మండలాల వారీగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

Published on Tue, 10/14/2025 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాల వారీగా లైసెన్సుడు సర్వేయర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ పూర్తి చేసుకున్న 7 వేల మందికి పైగా సిబ్బందిని మండలాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి రెవెన్యూ మండలంలోని గ్రామాలను బట్టి ఆయా మండలాలకు 4–6 మందిని లైసెన్సుడు సర్వేయర్లుగా నియమించనున్నట్టు సమాచారం.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో లైసెన్సుడ్‌ సర్వేయర్ల నియామకంపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. గత మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో ఏడువేల మందికి పరీక్షలు నిర్వహించారు. అదే నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో వారికి ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటీస్‌ శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇక, రెండోదశ శిక్షణను ఆగస్టు 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు.

తొలిదశ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అక్టోబర్‌ రెండో తేదీ నుంచి గ్రామాల్లో నియమించాలని ప్రభుత్వం భావించినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈలోపు పంచాయతీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాతే నియామకాలు జరపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. కానీ, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మళ్లీ పంచాయతీ ఎన్నికల కోడ్‌ వచ్చేలోపు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకాలను పూర్తి చేయాలని ఆ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో లైసెన్సుడు సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను పూర్తి చేయనుంది.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)