Breaking News

బాండ్‌పేపర్‌పై సూసైడ్‌నోట్‌ రాసి..

Published on Fri, 04/18/2025 - 08:28

సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్‌ సంస్థలో ఏజెంట్‌గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్‌ఐసీ ఏజెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని అల్గోల్‌ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్‌గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు. 

సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్‌ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

రూ.100 బాండ్‌ పేపర్‌పై సూసైడ్‌ నోట్‌
ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్‌ పేపర్‌పై సూసైడ్‌ నోట్‌ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్‌ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్‌ ఫౌండేషన్‌లో ఏజెంట్‌గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్‌ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్‌ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)