Breaking News

అమ్మానాన్నే నాకు ప్రేరణ..

Published on Sat, 05/03/2025 - 08:26

‘మా కుటుంబం న్యాయవిద్యతో ముడిపడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రాన్ని చూసి పెరిగిన నేను, ఇప్పుడు అదే కుటుంబ పరంపరలో భాగంగా న్యాయం కోసం పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది నాకు బాధ్యతను గుర్తు చేస్తోంది, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కర్తవ్యం కలిగిస్తోంది.’ అని అంటున్నారు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన దారా మేఘన. ఇటీవల వెలువడిన న్యాయశాస్త్ర ఫలితాల్లో వరంగల్‌ దర్గా కాజీపేటకు చెందిన మేఘన జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి 2023 న్యాయశాస్త్రం పట్టా పొంది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ప్రయాణంపై ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

 

 

 

 

ఎల్‌ఎల్‌బీని ఎందుకు ఎంచుకున్నారు?
నేను న్యాయశాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవిద్యను నా వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. జీవితమంతా ఆయన నాకు మోటివేషన్‌గా నిలిచారు. మా నాన్న నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు లా స్కూల్‌ వాతావరణాన్ని, విద్యార్థులను చూడగల అవకాశం కలిగింది. ఇదంతా న్యాయశాస్త్రం పట్ల నాలో ఆసక్తిని, అభిమానం పెంచింది.

మీకు ప్రేరణ ఎవరు. 
మా తల్లిదండ్రులే నాకు ప్రేరణ. మా నాన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్, అమ్మ ఎల్‌ఐసీలో సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌గా ఉన్నారు. వారి శ్రద్ధ, క్రమశిక్షణ నన్ను జీవితాన్ని సరిగ్గా ముందుకు నడిపించడంలో కలిసి వచ్చింది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, దానికి ప్రోత్సాహం, స్వేచ్ఛను ఇచ్చారు. ఇక తమ్ముడు వంశీకృష్ణ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, విద్యార్థినిగా ఎదుర్కొన్న కష్టాల్లో తోడుగా ఉన్నాడు. అలాగే, ప్రముఖ సీనియర్‌ అడ్వొకేట్‌ సి.విద్యాసాగర్‌ రెడ్డితో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఆయననుంచి న్యాయశాస్త్రం ప్రాయోగిక అంశాల్లో మార్గదర్శనం పొందాను. ఈ రంగాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన అప్పట్లో ఇచ్చిన సలహా నా జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇంకా, మా కళాశాల నుంచి పెద్దగా విజయాలు సాధించిన మా సీనియర్లు తరణి వేముగంటి, నేహా అగర్వాల్‌ విజయాలను దగ్గరగా చూసే అవకాశం లభించింది. తరణి ప్రస్తుతం సిద్దిపేటలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, అదనపు జేఎంఎఫ్‌సీగా పనిచేస్తున్నారు. నేహా అగర్వాల్‌ డీఎస్పీ పదవిని పొందారు. వారి మాటలు నాకు దిక్సూచి చూపాయి.  

ఎందుకు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. 
న్యాయశాస్త్రం ద్వారా న్యాయం సాధించడమే కాక సమాజానికి సేవ చేయవచ్చని నమ్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను 

మీరు ఎదుర్కొన్న సవాళ్లు.
నా ప్రయాణంలో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వచ్చింది. సమయం కూడా చాలా పరిమితంగా ఉండటంతో, ఆ సమయంలోనే అన్ని విభాగాలను కవర్‌ చేయాలన్న ఒత్తిడితో ఉన్నా. ఇదే సమయంలో, మా తమ్ముడు అమెరికాకు మాస్టర్స్‌ కోసం వెళ్లిపోవడం కూడా నాకు భావోద్వేగపూరితంగా కష్టంగా అనిపించింది. అయితే, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలిచి నా అడ్డంకులను అధిగవిుంచడంలో సహాయం చేశారు. 

 మీ నెక్ట్స్‌ గోల్‌? 
ఇప్పటినుంచి నా లక్ష్యం అత్యంత నిజాయితీగా, సమగ్రతతో సేవ చేయడం. న్యాయం వేగంగా అందించడానికీ, ఆలస్యం లేకుండా ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి పని చేయాలనుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, తమ్ముడికి, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ విజయాన్ని నాతో కలిసి పంచుకున్న బంధువులకు కూడా ధన్యవాదాలు.
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)