Breaking News

హీరో అనే పదం డ్రగ్‌ కంటే ప్రమాదకరం

Published on Mon, 12/01/2025 - 08:19

పల్నాడు జిల్లా: హీరో అనే పదం డ్రగ్‌ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త  మాదాసు భానుప్రసాద్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్‌ యాక్టర్, లీడ్‌ యా   ్రక్టెస్‌ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైసూ్కల్‌ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు.

 దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం  దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)