Breaking News

విమానానికి లేజర్‌ కాంతులు తగిలాయా?

Published on Thu, 10/16/2025 - 07:17

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్‌ కాంతులు వేయడం నిషేధం అయినప్పటికీ ఓ విమానం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా  తెలిసింది. మంగళవారం రాత్రి తిరుపతి నుంచి బయలుదేరి విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.30 సమయానికి చేరుకుంది.

 రన్‌వే 09ఆర్‌ వద్ద ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఎయిర్‌పోర్టుకు ఎడమవైపు బయటి ప్రాంతం నుంచి ఆకుపచ్చని రంగులోని లేజర్‌ కాంతులు విమానంపై పడినట్లు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్‌ వర్గాలు కానీ, ఎయిర్‌పోర్టు అధికారులు కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని శంషాబాద్‌ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు సీఐ కనకయ్య ‘సాక్షి’కి తెలిపారు.

 సుమారు ఆరేళ్ల కిందట రషీద్‌గూడలో కొందరు యువకులు బర్త్‌డే పార్టీ చేసుకున్న సమయంలో డీజేతో పాటు లేజర్‌ లైట్లు ఉపయోగించడంతో విమానాన్ని ల్యాండ్‌ చేస్తున్న సందర్భంలో పైలట్‌ కంగారు పడి ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన అప్పట్లో కలకలం రేపింది. తాజాగా వచ్చిన సమాచారం ఎయిర్‌పోర్టు ప్రిడెక్టివ్‌ ఆపరేషన్‌ కేంద్రానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఇది ఏఐ జనరేటెడ్‌ కావడంతో దీనిని ధ్రువీకరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)