Breaking News

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి?

Published on Thu, 05/08/2025 - 09:45

ములుగు, సాక్షి: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.  అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు.

ఆపరేషన్‌ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్‌ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)