Breaking News

రోవర్స్‌తో భూ కొలతలు

Published on Mon, 01/26/2026 - 03:27

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి కచ్చితత్వం వచ్చేలా ఆధునిక రోవర్స్‌తో ఇక భూ కొలతలు చేయిస్తాం. దీని కోసం మొదటి విడతగా 600 ఆధునిక రోవర్స్‌ను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేయిస్తున్నాం. క్షేత్ర స్థాయిలోకి వెళ్లే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఈ ఆధునిక టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుతున్నాం’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న 47 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు చుట్టంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించినట్టు తెలిపారు.  

31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. 
ధరణిలో జరిగిన లోపాలపై పైలట్‌గా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పూర్తి చేశామని, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవలకు జరిగాయని, భూ భారతి వచ్చిన తర్వాతే ఇది జరిగినట్టు ప్రతిపక్షాలు చెబుతున్నది వాస్తవం కాదని చెప్పారు. 

నాటి ధరణిలో ఉన్న లొసుగులతోనే ఇవి జరిగాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)