Breaking News

ఈఓ యూఎస్‌లో.. డిప్యూటీఈవో యూకేలో

Published on Fri, 10/31/2025 - 04:46

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పర్యవేక్షణ కొరవడింది. ఈఓ వెంకట్రావు నెలరోజులకు పైగా వ్యక్తిగత సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన లేనప్పుడు బాధ్యతలు చూడాల్సిన డిప్యూటీ ఈఓ లండన్, యూరప్‌ దేశాల్లో ఉన్నారు. ఇక ఇన్‌చార్జ్‌ ఈఓగా నియమితులైన రవినాయక్‌ సెప్టెంబర్‌ 24న బాధ్యతలు స్వీకరించారు. మొక్కుబడిగా రెండు, మూడుసార్లు విధులకు హాజరై.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. 

కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన  పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంటుంది. కానీ, ఉన్నతస్థాయి అధికారులు ఏ ఒక్కరూ లేకపోవడంతో ద్వితీయశ్రేణి, క్షేత్రస్థాయి సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది.

ఉన్నతాధికారులంతా సెలవుల్లో..
ఆలయ ఈఓ వెంకట్రావు ఆగస్టు 30వ తేదీన పదవీవిరమణ పొందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత పది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సెప్టెంబర్‌ 25న వ్యక్తిగత సెలవులపై అమెరికాకు వెళ్లారు. 

ఆయన స్థానంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ రవినాయక్‌ (ఐఏఎస్‌) ఇన్‌చార్జ్‌ ఈఓగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. సెలవులపై వెళ్లిన ఈఓ వెంకట్రావు ఇంకా రాకపోవడం.. ఇన్‌చార్జ్‌ ఈఓ సరిగా రాకపోవడంతో దేవస్థానం పాలన అస్తవ్యస్తంగా మారింది.

డీఈఓ, అనువంశిక ధర్మకర్త సైతం
ఈఓ సెలవుపై వెళితే ఆ బాధ్యతలను డీఈఓ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సూపరింటెండెంట్‌) చూసుకోవాలి. కానీ, డీఈఓ కూడా ఈఓ కంటే ముందుగానే యూకే, యూరప్‌ దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణం చేసేందుకు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అర్చకులతో కలిసి వెళ్లారు. 

పరిపాలన, పర్యవేక్షణ చేసేలా అధికారులు ఉన్నతస్థాయి వారు ఎవరూ లేకపోవడంతో భక్తులకు సమస్యలు ఎదురైనా పరిష్కరించేవారు లేకుండాపోయారు.  ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఇన్‌చార్జ్‌ ఈఓ వచ్చినా..
ఇన్‌చార్జ్‌ ఈఓగా నియమితులైన రవికుమార్‌ బాధ్యతలు ఈనెల 25వ తేదీతో ముగిశాయి. ఆ తర్వాత దేవాదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ హరీశ్‌కు ఇన్‌చార్జ్‌ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఇటీవల దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు.

చెక్‌పోస్టు వద్ద అక్రమాలు
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాదగిరి క్షేత్రంలో అక్రమాలు పెరుగుతున్నాయి. యాదగిరికొండపైకి కార్లలో రావాలంటే మూడవ ఘాట్‌ రోడ్డు చెక్‌పోస్టులో రూ.500 రుసుము చెల్లించాలి. చెక్‌పోస్టు సిబ్బంది టికెట్‌ జారీ చేసిన తర్వాతనే కొండపైకి వాహనాలను అనుమతిస్తారు. వాహన నంబర్, రుసుము వివరాలు లేకుండానే ఖాళీ టికెట్‌లు జారీ చేస్తుండటం వెలుగుచూసింది. 

ఈ విషయంపై ఓ వాహనదారుడు ఎస్‌పీఎఫ్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరికొందరు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించగా, వారు లేరని తెలిసి వెనుదిరిగారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)