Breaking News

చి‘వరి’కి పొరుగు కూలీలే దిక్కు

Published on Mon, 12/30/2024 - 04:01

సాక్షి, పెద్దపల్లి: యాసంగి సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పల్లెల్లో కూలీల కొరత అన్నదాత­ల­ను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు రెట్టింపు కూలి చెల్లిస్తేనే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డిమాండ్‌ మేరకు స్థానిక మహిళలకు రూ.500 నుంచి రూ.600, పురుషులకు రూ.1,000 వరకు కూలి చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు కూలి చెల్లించాల్సి రావడంతో అన్నదాతలపై పెట్టుబడి పెరుగుతోంది.

పొలాలు దూరంగా ఉండడంతో.. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, అదనంగా అల్పాహారం, టీ సమకూర్చడం రైతులపై ఆర్థిక భారానికి కారణమవుతోంది. మరికొన్నిచోట్ల పురుషులకు ఇతర ఖర్చుల కింద రూ.100 చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎకరాలో వరి నాట్లు వేసేందుకు రూ.4,000 – రూ.4,500 వరకు ఖర్చు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పైగా అవుతోంది. అదికూడా కేవలం కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. 

స్థానిక మహిళలకు రూ.5,500 చొప్పున.. ఎకరాలో వరి నాట్లు వేసేందుకు గంపగుత్తకు ఇస్తున్నా.. అదనంగా నారు పంచేందుకు రూ.1,000తో పురుషులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అదే వలస కూలీలకు.. వరి నాట్ల బాధ్యత గంపగుత్తకు ఇస్తే.. ఎకరాకు రూ.5,500తోనే మొత్తం పనులు చూసుకుంటున్నారు. దీంతో అదనపు భారం తగ్గడంతోపాటు, తక్కువ సమయంలోనే నాట్లు పూర్తవుతున్నాయి. ఫలితంగా రైతులు పక్కరాష్ట్రాల కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.

యంత్రాలు, వలస కూలీలే ఆధారం..
కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు అన్నదాతలు కొన్నేళ్లుగా వలస కూలీలు, యంత్రాలపై ఆధారపడు­తు­న్నారు. యంత్రాల కొరతతోపాటు కొన్ని నేలల్లో నాట్లు వేసే పరిస్థితి లేక.. మనుషులతో నాట్లు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులు వలస కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాకు వలస వస్తున్నారు. 

కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని.. రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు.

వలస కూలీలకు డిమాండ్‌
జిల్లాలో ఈ యాసంగిలో 2,04,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 1,91,351 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా సిద్ధం చేశా­రు. వలస కూలీల గ్రూపులుగా వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తుండటంతో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 

నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ అధికంగా ఉన్న గ్రామాల్లో రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క తేదీ ఇస్తూ బుక్‌ చేసుకొని వరి నాట్లు వేస్తున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రోజూ రూ.2 వేలు వస్తాయి 
పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం. నాకు రోజూ రూ.2 వేల కూలి గిట్టుబాటవుతుంది. ప్రతీ సీజన్‌లో రెండునెలలు ఇక్కడే మాకు పనులు దొరకుతాయి. రైతులు బాగా చూసుకుంటున్నారు.– బబుల్, కూలీ, కోల్‌కత్తా

పది రోజులైంది వచ్చి..
నేను కోల్‌కత్తా నుంచి వచ్చి పదిరోజులైంది. తెల్లారగానే పంట పొలాల్లోకి వెళ్తాం. రాత్రి వరకూ నాట్లు వేస్తాం. అందరం కలసికట్టుగానే ఉంటాం. ఇక్కడి వారికంటే మంచిగా నాట్లు వేస్తాం. మా రాష్ట్రంలో పనులు లేవు. –మంగళ్, కూలీ, కోల్‌కత్తా

మంది కూలీలను తీసుకొస్తా.. 
యాసంగి, వానాకాలంలో వరినాట్ల కోసం ఏటా పశ్చిమబెంగాల్, కోల్‌కత్తా నుంచి సుమారు 560 మందికి కూలీలను తీసుకొస్తా. రైతులకు ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఎనిమిదేళ్లుగా ఏటా ఇలాగే చేస్తున్నా.–  కసిరెడ్డి మల్లారెడ్డి, ఏజెంట్, గుండ్లపల్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)