Breaking News

నాకు పదవి లేకున్నా.. ఉన్నట్లే

Published on Tue, 08/19/2025 - 12:04

నల్గొండ జిల్లా: తనకు పదవి లేకున్నా.. ఉన్నట్లేనని, వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తన కుమారులతో కలిసి అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దవూర మండలం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ దాచిరెడ్డి మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బిల్డర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి(దాచిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి) సోదరులు రూ.12లక్షల సొంత ఖర్చులతో నిర్మించిన ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లను సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సొంత నిధులతో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మాధవరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడవద్దని సూచించారు. 

ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధచూపుతూ నాకంటే ఎక్కువ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డికి సూచించారు. వారంలో రెండు రోజులు మద్యం తాగడం బంద్‌ చేసి ఆ డబ్బులతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేసుకోవాలని తనతో పాటు డీవీఎన్‌రెడ్డి కూడా కొంత సహాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, బిల్డర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ధర్మారెడ్డి, బోయ నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, రామలింగయ్య, నాగరాజు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)