Breaking News

కృష్ణమ్మ తర్వాతే గంగమ్మ!

Published on Mon, 12/08/2025 - 02:22

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అతిపెద్ద నది గంగ.. అతిపెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ అత్యధిక నీటి నిల్వ సామర్థ్యంగల జలాశయాలు ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్‌)లో కృష్ణా అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాతే గంగా బేసిన్‌ ఉంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 
అధ్యయన నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.. 

⇒ దేశంలో అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,651.73 టీఎంసీలు. 
⇒  కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,789 టీఎంసీలుకాగా నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 146.79 టీఎంసీలుగా ఉంది. కృష్ణా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం కలిపితే 1,935.79 టీఎంసీలకు పెరుగుతుంది. 

⇒ గంగా బేసిన్‌లో పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,719.28 టీఎంసీలుగా ఉండగా నిర్మాణంలో ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యం 270.17గా ఉండనుంది. 
⇒ గంగా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం కలిపితే 1,989.45 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే అత్యధిక నీటి నిల్వగల రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌లలో కృష్ణమ్మను గంగమ్మ అధిగమించి ప్రథమ స్థానానికి చేరుతుందన్న మాట. 

⇒ చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్రా నది హిమాలయ నది. జీవనది. కానీ వర్షఛాయ ప్రాంతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండటం విశేషం. దేశంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌లలో పెన్నా పదో స్థానంలో నిలిస్తే.. బ్రహ్మపుత్ర 11వ స్థానంలో నిలవడం గమనార్హం. బ్రహ్మపుత్ర బేసిన్‌ పర్వతాలు, లోయలతో కూడుకున్నది. జలాశయాల నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)