Breaking News

మడతపెట్టే ఎలక్ట్రిక్‌ సైకిల్‌

Published on Fri, 07/03/2026 - 03:16

కోరుట్లటౌన్‌/జగిత్యాలరూరల్‌: జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీఎంశ్రీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు, జగిత్యాల రూరల్‌ మండలం కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు కేంద్ర ప్రభుత్వ బిల్డథాన్‌కు ఎంపికయ్యాయి. ఫోల్డింగ్‌ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’అనే అంశంపై ఆ పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు చందా నాగరాజు పర్యవేక్షణలో కోరుట్ల విద్యార్థులు ఎస్‌.మాని, కె.హారిక, డి.మధులిక, జి.రేవతి, జి.ప్రణీత్‌ తయారు చేశారు. ఈ సైకిల్‌ మడతపెట్టి తక్కువ స్థలంలోనే ఉంచే సౌకర్యం ఉంది.  

తయారు చేసిన విధానం 
నాలుగు ఫీట్ల పొడవున్న పాత సైకిల్, ఒక చిన్న బ్యాటరీ, ఒక విద్యుత్‌ మోటారు తీసుకున్నారు. సైకిల్‌ను 2 ఫీట్లకు రెండు భాగాలుగా వెల్డర్‌ సాయంతో కట్‌ చేయించారు. తలుపులకు వాడే ఇండెస్‌ పట్టీల సాయంతో ఫోల్డింగ్‌ అయ్యేలా అమర్చారు. బ్యాటరీకి మోటారు బిగించి సైకిల్‌ ముందు భాగంలో ఫిట్‌ చేసి.. నడిచేలా రూపొందించారు. దీనిని బస్సులోనూ తీసుకెళ్లవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని విద్యార్థులు ప్రాజెక్ట్‌లో భాగంగా నమూనాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా.. బిల్డథాన్‌కు ఎంపికైనట్టు సమాచారం వచ్చిందని జిల్లా సైన్స్‌ అధికారి మచ్చ రాజశేఖర్, పాఠశాల హెచ్‌ఎం వడ్లకొండ గంగాధర్‌ తెలిపారు.

సేఫ్‌ హోమ్‌ ఎగ్జిట్‌ పేరిట.. 
కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌కు చెందిన ఎండీ.యాసర్‌ అబాసి, సీహెచ్‌.మహత్, కే.దినేష్‌ కలిసి గైడ్‌ టీచర్‌ సి.శివకృష్ణ (పీజీటీ) పర్యవేక్షణలో సేఫ్‌ హోమ్‌ ఎగ్జిట్‌ పేరిట గ్యాస్‌ టర్న్‌ ఆఫ్‌ డివైస్‌ రూపొందించారు. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ను ఆఫ్‌ చేయడం మరిచిపోయినా ఈ పరికరం సిగ్నల్‌ ఇస్తుంది. సిలిండర్‌ ఆఫ్‌ చేస్తేనే ఇంటి తలుపులు క్లోజ్‌ అవుతాయి. తద్వారా ప్రమాదాలను నివారించొచ్చు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)