Breaking News

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లి..

Published on Wed, 07/22/2026 - 12:15

కోరుట్ల/మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఆగి ఉన్న బస్సును మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి అడ్డదిడ్డంగా నడిపి బీభత్సం సృష్టించాడు. సుమారు 15 కి.మీ. మేర హైవేపై బస్సును తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కోరుట్ల బస్టాండ్‌లో డ్రైవర్‌ ప్రవీణ్‌ బస్సును నిలిపి టీ తాగుదామని కండక్టర్‌తో కలిసి వెళ్లాడు. ఇంతలో ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య (40) మద్యం మత్తులో బస్సు ఎక్కి ఇన్‌గేట్‌ నుంచి బస్సును తీసుకెళ్లి హైవేపైకి మళ్లించాడు. గమనించిన ప్రవీణ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 వెంటనే కోరుట్ల, కథలాపూర్‌ పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించారు. మెట్‌పల్లికి వెళ్లేలోపు సాంబయ్య కోరుట్ల శివారులో ఓ బైక్‌ను, ఆరపేట వద్ద మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత సాంబయ్య కథలాపూర్‌ పోలీసుల వాహనాన్నీ ఢీకొట్టాడు. గండిహనుమాన్‌ చెక్‌ పోస్టు సమీపంలో పోలీసులు లారీ, ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచడంతో సాంబయ్య బస్సును పక్కకు మళ్లించే క్రమంలో బస్సు రోడ్డు దిగి ఆగింది. ఆ వెంటనే పోలీసులు సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)