Breaking News

టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రాజీనామా

Published on Sat, 06/01/2024 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కా బ్‌) చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేళ్లలో సహ కార బ్యాంకులను దేశంలో అగ్ర గామిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకులను బలోపేతం చేశానన్నారు. ప్రభు త్వం మారడంతో తనపై అవిశ్వాసం పెట్టారని, కానీ అంతకన్నా ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్‌ సహకారంతో సహకార బ్యాంకులను బలోపేతం చేసి, రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకు న్నట్లు వివరించారు. తాము వచ్చిన తర్వాత బ్యాంకుల్లో 7,165 ఉద్యో గాలను భర్తీ చేసినట్లు తెలిపారు. గోదాముల నిర్మాణం, పెట్రోల్‌ బంకుల ఏర్పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి వ్యాపా రాలను నిర్వహించిన ట్లు చెప్పారు. సహకార బ్యాంకుల కంప్యూటరీ కరణ, ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బోర్డులోని డైరెక్టర్లు పార్టీ మారి తనపై అవిశ్వాసం పెట్టార న్నారు. అందుకే తాన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో టెస్కా బ్‌ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)