Breaking News

వెబ్‌ ఆప్షన్లకు నోటిఫికేషన్‌

Published on Tue, 09/23/2025 - 00:52

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) విడుదల చేసింది.

బీ,సీ కేటగిరీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన 6,406 మందితో ఫైనల్‌ జాబితాను వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం 24 మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ రిజి్రస్టార్‌ కోరారు. ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు  https:// tspvtmedadm. tsche. in  వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

6,406 మంది అర్హులతో ఫైనల్‌ జాబితా 
ఈనెల 20న యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన మేనేజ్‌మెంట్‌ కోటా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో పేరు ఉన్న నీట్‌ యూజీ అర్హులైన అభ్యర్థులే ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 26 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2,120 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద కేటాయించారు. ఇందులో బీ కేటగిరీ కింద 1,480 సీట్లు ఉండగా, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 640 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీడీఎస్‌ కింద రాష్ట్రంలోని ఆర్మీ డెంటల్‌ కాలేజీతో పాటు 10 ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద 543 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఆర్మీ డెంటల్‌ కాలేజీలోని 43 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఆర్మీ సిబ్బంది వారసులకే కేటాయించనున్నారు. మిగతా 10 ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 50 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద కేటాయించారు. వీటిలో 30 సీట్లు లోకల్‌ కేటగిరీలో, 5 సీట్లు అన్‌ రిజర్వుడ్‌ కింద, మరో 15 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయించనున్నారు. కాగా మెరిట్‌ అభ్యర్థులు కోర్సు, కళాశాల, కేటగిరీ (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ) వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా, కరీంనగర్‌కు చెందిన చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీలో ప్రవేశాలు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఆధారంగా ఉంటాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది. మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు ముస్లిం మైనారిటీ విద్యార్థులకే కేటాయిస్తారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు అందుబాటులో లేకపోతే, చివరి దశలో గరిష్టంగా 30 శాతం వరకు నాన్‌–మైనారిటీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)