Breaking News

రక్షణ రంగంలో భారత్‌ అగ్రగామి: గవర్నర్‌

Published on Sat, 01/04/2025 - 05:59

గోల్కొండ (హైదరాబాద్‌): రక్షణ రంగంలో భారత దేశం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ఆయన ఇండియన్‌ ఆర్మీ ఏర్పాటు చేసిన ‘నో యువర్‌ ఆర్మీ’మేళాను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యం వాడే ఆయుధాలను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత గవర్నర్‌ ఒక్కో స్టాల్‌ను తిరిగి అక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆయుధాలను చూసి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడు తూ యుద్ధంలో వాడే వివిధ రకాల ఆయు« దాలను ఎక్కువ శాతం మన దేశమే సొంతంగా తయారు చేసుకుంటోందన్నారు. మన దేశం రక్షణ రంగంలో ప్రపంచంలోనే మేటి అని, అత్యాధునికమైన, ఖరీదైన ఆయుధాలు భారత్‌ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటి సారి ఆర్మీవారు తమ ఆయుధాలను ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారని తెలిపారు. అనంతరం గవర్నర్‌ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ‘నో యువర్‌ ఆర్మి’మేళా పర్యాటకులతో పాటు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

‘నో యువర్‌ ఆర్మీ’మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)