Breaking News

మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు..

Published on Wed, 05/26/2021 - 09:32

మధిర/ ఎర్రుపాలెం: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చేకూరి కాశయ్య(85) హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను కొనియాడారు. నిబద్ధత గల నేతగా కీర్తి పొందిన ఈయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. చేకూరి నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు 1936లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత మధిర హైసూ్కల్‌లో 1951-1952లో హెచ్‌ఎస్‌సీ పూర్తిచేశారు. విద్యార్థి నాయకుడిగా, మంచి వక్తగా, బహుభాషా కోవిధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొత్తగూడెంలో స్థిరపడి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు.

ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధిర టీవీఎం పాఠశాల పూర్వవిద్యార్థి సంఘాన్ని 1979లో స్థాపించగా ఆయన వ్యవస్థాపక ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావుకు సన్నిహితుడిగానూ మెలిగారు. 1956లో హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1958–60లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 1964 మార్చిలో రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరిగి 1970లో కూడా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేగా ఇలా..
కొత్తగూడెం నియోజకవర్గంనుంచి 1972లో, 1978లో శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయాలకు పునాది మానవ సంబంధాలు, అనుబంధాలు అని చెబుతుండేవారు. 1978లో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంపై పోరాటం చేయడం, కమిషన్‌ చేయించడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1978లో 80 వేలమంది సింగరేణి కార్మికులు 54 రోజులపాటు చేపట్టిన సమ్మె విజయం సాధించడంలో శాసన సభ్యుడిగా ఆయన పోరాట పటిమను, నిజాయితీని నిరూపించుకున్నారు. 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా విజయం సాధించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు.

మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నివాళి..
ఖమ్మం రూరల్‌: ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్‌ ఆవరణలో ఉంచిన చేకూరి కాశయ్య భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు తదితరులు నివాళులరి్పంచారు.

#

Tags : 1

Videos

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)