Breaking News

నేటి నుంచి నాగోబా జాతర

Published on Sun, 01/18/2026 - 07:39

సాక్షి, ఆదిలాబాద్‌: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా ఆలయంలో అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించనుంది. 22న గిరిజన దర్బార్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రానున్నట్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ తెలిపారు. 

కేస్లాపూర్‌ వద్ద అన్ని రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 22 కోట్లు కేటాయిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ నుంచి కేస్లాపూర్‌కు వచ్చే దారిలో 4 కిలోమీటర్ల పరిధిలో రూ. 15 కోట్లతో డబుల్‌ రోడ్డు పనులకు ఇటీవలే భూమిపూజ చేశారు. రూ. కోటితో ఆలయ ఆవరణలో భోజనాల కోసం షెడ్‌ను నిర్మించతలపెట్టారు. 

సంప్రదాయాలకు పెద్దపీట..
నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్య మాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహా ఘట్టానికి శ్రీకారం చుడుతారు. ఆ మరుసటి రోజు నుంచి మెస్రం వంశీయులు నివసించే ఏడు గ్రామాలను చుట్టిరావడం మొదలుపెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే ఏడు గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరుతారు. 

పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్‌ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకొని బస చేస్తారు. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్న మెస్రం వంశీయులు శనివారం ఉదయం తూమ్‌ (కర్మకాండ) పూజలు పూర్తి చేశారు. ఆదివారం పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని నాగోబాకు మహాపూజలు నిర్వహించడం ద్వారా జాతరను ప్రారంభించనున్నారు.


 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు