Breaking News

వీడియో: కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి..

Published on Thu, 09/25/2025 - 10:31

సాక్షి, కీసర: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న తమ కూతురిని అత్తారింటి నుంచి బలవంతంగా సినీఫక్కీలో ఆమె తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారు. అడ్డు వచ్చిన బాధితురాలి భర్త, ఆయన కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెంది జలగం ప్రవీణ్, ఇదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం నచ్చని యువతి తల్లిదండ్రులు ప్రవీణ్‌ నుంచి తమ కూతురును ఎలాగైనా విడదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్వేత తల్లిదండ్రులు బాల నర్సింహ, మహేశ్వరి, మేనమామ మోహన్, తమ్ముడు సాయితో పాటు మరికొందరు ఉదయం 9 గంటల సమయంలో ప్రవీణ్‌ ఇంటిపై దాడి చేశారు.

ప్రవీణ్‌తో పాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల కళ్లలో కారం చల్లి, తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేశారు. శ్వేతను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ప్రవీణ్‌ పాటు ఆయన తల్లికి గాయాలయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.   తమపై దాడికి పాల్పడి శ్వేతను బలవంతంగా కిడ్నాప్‌ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్‌ కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)