Breaking News

ఘెరం.. తమపై పోటీచేశారని కోపంతో మహిళలపైకి ట్రాక్టర్ ఎక్కించి

Published on Mon, 12/15/2025 - 15:03

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సోమర్‌పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పాపయ్య, బాలరాజ్‌ అనే ఇద్దరు  అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపోందారు. దీంతో ఎన్నికల్లో తమ పైనే పోటీ చేశారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్‌ కుటుంబంపై ట్రాక్టర్‌ ఎక్కించాడు.

ఈ ప్రమాదంలో బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్వవలకు  తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్‌పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ ఘటనపై సోమర్‌పేట గ్రామం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఎల్లారెడ్డిలో 4 గంటలుగా ధర్నా చేపడుతున్నారు.  

ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మెుహరించారు. రాష్ట్రంలో మూడుదశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చివరిదశ  ఎలక్షన్లు 17 తారీఖున జరగనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)