Breaking News

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి

Published on Sun, 12/31/2023 - 03:32

హన్మకొండ/ ఎస్‌ఎస్‌ తాడ్వాయి: దక్షిణ భారత కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భా రత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కేంద్ర ప్రభు త్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మ క్క– సారక్క పేరు పెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీ లిచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మేరకు జనవరి 1 నుంచి రూ.4 వేల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌లో పెన్షన్, రైతుబంధు సకాలంలో అందించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక రాకముందే ఆగమాగం చేస్తున్నారని, దీనిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే మాట్లాడారని గుర్తు చేశా రు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్‌రావు, మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ తదితరులు దర్శించుకున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)