Breaking News

మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్‌ కుమార్‌పై జస్టిస్‌ పీపీ ఘోష్‌ ఆగ్రహం

Published on Thu, 12/19/2024 - 12:19

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌పై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్‌ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్‌.. కోర్టు హాల్‌లోకి సోమేష్‌ను పిలిచారు.

అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్‌ ఆగ్రహం​ ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్‌ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.

సూటిగా సమాధానాలివ్వండి
కమిషన్‌ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో..  ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

మాజీ CS సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)