Breaking News

కాళేశ్వరం కమిషన్‌ తుది దశ విచారణ.. వీటిపైనే ఫోకస్‌

Published on Thu, 04/24/2025 - 14:59

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్.. తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే రెండో వారం వరకు విచారణ కొనసాగించనుంది. మే రెండో వారంలో ప్రభుత్వానికి తుది రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్.. దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్‌కు ఎన్‌డీఎస్‌ఏ ఫైనల్ రిపోర్ట్  అందకపోవడంతో ఆ నివేదిక కోసం ఎన్‌డీఎస్‌ఏకి కమిషన్‌ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్‌డీఎస్‌ఏ మరో మూడు వారాల సమయం కోరింది.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి ప్రశ్నించాల్సి ఉంది.

ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని కమిషన్‌ కోరే అవకాశముంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్‌ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)