Breaking News

‘పోర్న్‌ వీక్షణం వల్లే లైంగిక వేధింపులు’

Published on Sun, 07/23/2023 - 04:05

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో ఇంటర్నెట్‌లో పోర్న్‌ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా అందుబాటులో ఉంటోందని, పిల్లలపై లైంగిక వేధింపులు అధికం కావడా నికి ఇదే ప్రధాన కారణమని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత బాలలను పోలీసులు వారి పిల్లలుగా భావించి పకడ్బందీగా దర్యాప్తు చేసినప్పుడే దోషులకు శిక్షపడుతుందన్నారు. శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వచి్చన కైలాష్‌ సత్యారి్థ... డీజీ పీ కార్యాలయంలో పోలీస్‌ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

పిల్లల అక్రమ రవాణా వ్యవస్థీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని కైలాష్‌ సత్యార్థి పేర్కొన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని ప్రశంసించారు. మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల పాత్ర దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని కితాబిచ్చారు.

డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిం దని, ఇందులో భాగంగా అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అదనపు డీజీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ కైలాష్‌ సత్యార్థి కృషి వల్లే తప్పిపోయిన పిల్లల అంశంపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు ప్రారంభమైందని, ఆ తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు.

అనంతరం పోలీసు అధికారులు కైలాష్‌ సత్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు షికా గోయల్, సౌమ్యా మిశ్రా, సంజయ్‌ కుమార్‌ జైన్, ఐజీలు విక్రమ్‌జిత్‌సింగ్‌ మాన్, షానవాజ్‌ ఖాసీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.  

ప్రతి విద్యార్థి భయాన్ని వీడాలి
రాయదుర్గం: ప్రతి విద్యార్థి తమకున్న ప్రతిబంధకాలు, చింతలు, భయాలన్నింటినీ వీడి ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ 22వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ గవరి్నంగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాజ్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీజే నారాయణన్‌తో కలిసి విద్యార్థులకు పట్టాలను,  పంపిణీ చేశారు. కైలాష్‌ మాట్లాడుతూ కేవలం జీతాలు, ప్యాకేజీల కోసం వెంటపడకుండా నైతిక విలువలు, సేవా భావంతో జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు.

నారాయణన్‌ మాట్లాడుతూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు స్వంత మార్గాలను రూపొందించే నైపుణ్యాలను కలిగి ఉన్నారని తె లిపారు. డ్యూయల్‌ డిగ్రీతోపాటు ఉత్తమ ఆల్‌రౌండర్‌ అవార్డును పొందిన కందాల సవితా విశ్వనాథ్‌ను పలువురు అభినందించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)