Breaking News

అనుమతి లేకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదల

Published on Wed, 09/25/2024 - 05:48

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన రూ.159 కోట్ల బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి నీటిపారుదల శాఖ మహదేవ్‌పూర్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ తిరుపతిరావు విడుదల చేశారు. శాఖ ఉన్నతాధికారులకు కూడా ఆయన సమాచారం ఇవ్వలేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ అజ్మల్‌ఖాన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం కమిషన్‌ నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీలు విడుదల చేసే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్‌టేకింగ్‌ తీసుకున్నా రా? అని కమిషన్‌ ప్రశ్నించగా, ఈ విషయంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు. 

⇒ తాను విధుల్లో చేరకముందే మేడిగడ్డ బరాజ్‌ పూర్తయిందని మాజీ డిప్యూటీ ఎస్‌ఈ ఎస్‌.సత్యనారాయణ కమిషన్‌కు తెలిపారు.  
⇒2022 జూలైలో బరాజ్‌లకు భారీ వరదలు రావడంతో అప్రాన్, సీసీ బ్లాకులు కొట్టుకుపోయా యని ఎస్‌ఈగా పనిచేసిన కరుణాకర్‌ చెప్పారు. మరమ్మతులు చేయాలని నిర్మాణ సంస్థలకు లే ఖలు రాశామన్నారు. బరాజ్‌ల నిర్మాణం తర్వా త రెండేళ్ల పాటు డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ అమల్లో ఉంటుందని, మూడేళ్ల పాటు నిర్వహణను ఆ సంస్థలే చూడాల్సి ఉంటుందన్నారు.  

⇒ బరాజ్‌లు డ్యామేజీకి కారణం ఏమిటని కమిషన్‌ ప్రశ్నించగా, మోడల్‌ స్టడీస్‌లో బరాజ్‌లకు వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయారని, ప్రతీ సెకనుకు 4.35 మీటర్ల వేగంతో వరద వ స్తుందని అంచనా వేయగా, 12–14 మీటర్ల వేగంతో వచి్చందని చెన్నూరు ఈఈ–2 బి.విష్ణుప్రసాద్‌ బదులిచ్చారు. బరాజ్‌లలో సీపేజీని గుర్తించి 2019 డిసెంబర్‌ 16న సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు లేఖ రాయగా, 2020 డిసెంబర్‌ 22న ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం కోసం అయ్యే అంచనాలను అందించారని బదులిచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)