Breaking News

సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్‌ ఆగ్రహం

Published on Tue, 11/26/2024 - 15:32

సాక్షి ,హైదరాబాద్‌ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్‌ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్‌లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్‌ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. 

మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్‌ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. 

ఈ విచారణలో కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్‌ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్‌ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్‌లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్‌ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్‌ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.

ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్‌ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్‌లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్‌ తన విచారణను ముగించింది.

తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షం
తొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్‌ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్‌ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్‌.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసింది

ఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్‌ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)