Breaking News

మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్‌ ఘోష్‌ అసహనం

Published on Mon, 11/25/2024 - 15:37

హైదరాబాద్‌, సాక్షి: కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ ముందు ఇవాళ  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ చంద్రఘోష్‌ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కమిషన్‌ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్‌ చంద్రఘోష్‌ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.

కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.

ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్‌ ముందు చెప్పారు.

కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్‌స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం.

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)