Breaking News

రాజవ్వ అటుకులు.. ఆహా!

Published on Sat, 03/15/2025 - 11:09

జగిత్యాల టౌన్‌: రాజవ్వ అటుకులంటే జగిత్యాలలో తెలియని వారుండరు. ఆ టేస్టుకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల పట్టణ టవర్‌ సర్కిల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో రాజవ్వ అనే మహిళ గత 25 ఏళ్లుగా రుచికరమైన అటుకులు, చాయ్‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. శుచి, శుభ్రతతో తయారు చేసిన అటుకులకు దాల్చా చేర్చి నిమ్మకాయ పిండి ఇచ్చే అటుకులకు టిఫిన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. 

ఉదయం నుంచే రాజవ్వ అటుకుల కోసం టిఫిన్‌ ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్లేట్‌ కేవలం రూ. 20కే అందిస్తున్న రాజవ్వ అటుకులను మార్కెట్‌కు వచ్చే కొనుగోలు దారులు, కూరగాయల అమ్మకం దారులు, వ్యాపారులు తెగ ఇష్టపడి తింటుంటారు. దేశ విదేశాల్లో కూడా రాజవ్వ అటుకుల గురించి చర్చ జరగడం ఇక్కడి అటుకుల రుచికి నిదర్శనమని పలువురు టిఫిన్‌ ప్రియులు చెబుతున్నారు. జగిత్యాల కూరగాయల మార్కెట్‌ అంటే టక్కున గుర్తుకు వచ్చేది రాజవ్వ అటుకులే కావడం విశేషం. అటుకులే కాదు రాజవ్వ చేసే చాయ్‌ అంటే కూడా చాయ్‌ ప్రియులు ఎంతో ఇష్టపడి తాగుతుండటం విశేషం.

ఇంట్లో తిన్నట్లుంటుంది 
రాజవ్వ చేసే అటుకులు తింటే ఇంట్లో చేసిన అటుకులు తిన్న అనుభూతి కలుగుతుంది. శుచి, శుభ్రతతో పాటు మంచి రుచితో ఉండే రాజవ్వ అటుకులంటే నాతో పాటు నా మిత్రులు ఇష్టపడతారు. మిత్రులతో కలిసి రాజవ్వ హోటల్లో అటుకులు తింటాను.           – ప్రసాద్‌గౌడ్, స్థానికుడు

అటుకులు బాగుంటాయి 
మాది జగిత్యాల మండలం నర్సింగాపూర్‌. నేను రైతును. పలు రకాల కూరగాయలు మార్కెట్‌కు తెచ్చి అమ్ముతుంటాను. రాజవ్వ హోటల్‌ వద్ద రుచికరమైన అటుకులు తిన్నాకే దందా మొదలు పెడతాను. రాజవ్వ చేసే అటుకులు చాలా రుచిగా ఉంటాయి.            – గంగవ్వ, రైతు 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)