Breaking News

లెక్కల్లో గోల్‌మాల్‌.. శ్రీచైతన్య కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Published on Tue, 03/11/2025 - 07:57

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు.

పన్ను ఎగవేత ఆరోపణలపై అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రతతో సోదాలు కొనసాగాయి. కాలేజీల నిర్వహణ, విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, సంస్థ ఆయా బ్రాంచీలవారీగా చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందుకు విద్యార్థుల నుంచి అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్టు గుర్తించారు.  

రూ. 5 కోట్ల  రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్‌వేర్లను ఐటీ అధికారులు పరిశీలించారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటి సోదాలు నిర్వహించగా, గతంలోనూ 11 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తోంది. మాదాపూర్‌లోని శ్రీచైతన్య హెడ్‌ ఆఫీస్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)