Breaking News

దేశంలో నంబర్‌వన్‌ బిజినెస్‌ స్కూల్‌ ‘ఐఎస్‌బీ’

Published on Tue, 05/23/2023 - 09:44

సాక్షి, రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) దేశంలోనే నంబర్‌ వన్‌ బిజినెస్‌ స్కూల్‌గా మరోసారి గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 29వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూ­టివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్‌ ర్యాంకింగ్‌–2023ని సోమవారం ప్రకటించారు. 

గతేడాది ప్రపంచస్థాయిలో 38వ స్థానంలో ఉన్న ఐఎస్‌బీ ఈసారి  29వ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకులతో ఐఎస్‌బీ అసాధారణమైన ఎగ్జిక్యూ­టివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లకు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లయింది. ఇక భవిష్యత్‌లో అనుకూలించే  ప్రోగ్రామ్‌ల విభాగంలో  ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ర్యాంకు పొందిన ఐఎస్‌బీ.. ఎఫ్‌టీ ఎగ్జిక్యూ­టివ్‌ ఎడ్యుకేషన్‌ ఓపెన్‌ ర్యాంకింగ్‌ 2023లో దేశంలో మూడవ స్థానం, ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. కాగా గ్రోత్‌ పారామీటర్‌లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉండడం విశేషం. 

ఈ సందర్భంగా ఐఎస్‌బీ డిప్యూటీ డీన్, ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రొఫెసర్‌ దీపామణి మాట్లాడుతూ ఎఫ్‌టీ ర్యాంకింగ్‌లో ఉన్నతస్థానంతో పాటు భవిష్యత్తు ఉపయోగం పారామీటర్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్‌ తాము మరింతగా కష్టించి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)